Sometimes you need advice, Ask a teacher to solve your problems.

Make a Difference with education, and be the best.

Make a Difference with education, and be the best.

Latest Posts

Tuesday, December 1, 2020

Pathan Muneer Khan|Trialpro3

Telugulo Islam.Ahmed

 సామూహిక నమాజు

 








దైవప్రవక్త
 ముహమ్మద్(సల్లంప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రధితెలిపారు: మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడుతరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడునమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్ కు తీసుకువస్తే - అలాంటి వ్యక్తి మస్జిద్చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో ; అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతసు పెరుగుతూ ఉంటుందిఅతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది తరువాత మస్జిద్ లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంత సేపూ అతను నమాజు చేస్తున్నట్లుగానే పరిగణించబడతాడుమీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకుఅతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ అల్లాహ్ వ్యక్తిని కరుణించు అల్లాహ్ ! ఇతన్ని మన్నించు అల్లాహ్ఇతన్ని కనిపెట్టుకుని ఉండుఅని విన్నవించుకుంటూ ఉంటారు 

(హదీసు గ్రంథాలు  బుఖారీ - ముస్లిం)

హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివిహదీసులో వచ్చిన పదం యన్ హుజుహూ" అంటే అతన్ని బయటికి తీసుకు వస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.

(సహీహ్ బుఖారీలోని నమాజు ప్రకరణంసహీహ్ ముస్లింలోని నమాజు ప్రకరణం)

Pathan Muneer Khan |trialpro2

Telugulo Islam.Ahmed


 

సంకల్పం గురించి అల్లాహ్, అల్-ఖుర్ఆన్ ద్వారా ఏం తెలియచేస్తున్నాడు?


అల్లాహ్ సెలవిచ్చాడువారు అల్లాహ్ కు దాస్యం చేయాలనిపూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనినమాజ్ను స్థాపించాలనిజకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగిందిఇదే ఎంతో సరియైన ధర్మం.” 

(ఆల్ బయ్యినహ్ : 5) 

 

మరోచోట అల్లాహ్ సెలవిచ్చాడు : వాటి మాంసమూ అల్లాహ్ ను చేరదువాటి రక్తమూ చేరదుకాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి." 

(అల్ హజ్ - 37)

 

ఇంకొకచోట ఆయన ఇలా ఆదేశించాడు : "ప్రవక్తాప్రజలను ఇలా హెచ్చరించు : “మీరు దాచినా లేక బహిర్గతం చేసినా - మీ మనసుల్లో ఉన్నదంతా అల్లాహ్ కు తెలుసు." 

(ఆలి ఇమ్రాన్ - 29) 

Pathan Muneer Khan|trialpro

Telugulo Islam.Ahmed

 అల్-గఫ్ఫార్ యొక్క కరుణా కారుణ్యాలు


దైవప్రవక్త (సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ తెలియజేశారు.“జీవితంలోని అంతిమ ఘడియలు దాపురించక ముందువరకూ అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తూనే ఉంటాడు.” ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి హసన్ గా ఖరారు చేశారు.


(సుననె తిర్మిజీలోని ప్రార్ధనల ప్రకరణంలో చరమ ఘడియలకంటే ముందు పశ్చాత్తాపం ఆమోదించబడుతుందన్న ఆధ్యాయంలో ఈ హదీసు ప్రస్తావించబడింది.)


ముఖ్యాంశాలు


పై హదీసులో “గర్ గరా” అనే పదం వాడబడింది. ఇది ఆత్మ శరీరాన్ని వదలి కంఠానికి చేరుకునేదానికి ధ్వన్యానుకరణం. అంటే జీవితపు చివరి శ్వాసలన్నమాట.

ఈ హదీసును 'హసన్'గా ఖరారు చేయడం జరిగిందంటే ఈ హదీసు పరంపరలో వైవిధ్యాలకు, లొసుగులకు తావులేదు గాని దీని ఉల్లేఖకులు సహీహ్ హదీసుల ఉల్లేఖకుల కంటే తక్కువ స్థాయికి చెందినవారని అర్థం. హదీసువేత్తల దృష్టిలో సహీహ్ హదీసుల మాదిరిగా “హసన్" కోవకు చెందిన హదీసులు కూడా ఆచరించదగినవే. 



Our Team

  • Syed Faizan AliMaster / Computers
  • Syed Faizan AliMaster / Computers