సంకల్పం గురించి అల్లాహ్, అల్-ఖుర్ఆన్ ద్వారా ఏం తెలియచేస్తున్నాడు?
అల్లాహ్ సెలవిచ్చాడు: “వారు అల్లాహ్ కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను స్థాపించాలని, జకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగింది. ఇదే ఎంతో సరియైన ధర్మం.”
(ఆల్ బయ్యినహ్ : 5)
మరోచోట అల్లాహ్ సెలవిచ్చాడు : “వాటి మాంసమూ అల్లాహ్ ను చేరదు, వాటి రక్తమూ చేరదు. కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి."
(అల్ హజ్ - 37)
ఇంకొకచోట ఆయన ఇలా ఆదేశించాడు : "ప్రవక్తా! ప్రజలను ఇలా హెచ్చరించు : “మీరు దాచినా లేక బహిర్గతం చేసినా - మీ మనసుల్లో ఉన్నదంతా అల్లాహ్ కు తెలుసు."
(ఆలి ఇమ్రాన్ - 29)

0 comments:
Post a Comment